ఉప్పొంగిన ఉత్సాహం.. ఉరకలేసిన ఆనందం..!

- రెండేళ్ల తరువాత పుర విధుల్లో అమ్మవారి విశ్వరూపం

- అడుగడుగునా అమ్మవారికి జంతుబలులు
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో నెలకొని యుండు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు శిరస్సు పట్టణ పురవిధుల్లో ఊరేగింది. పట్టణంలోని చెరువు కట్టపైకి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడి కోనేటి వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి కళ్ళకు కట్టిన తెరను తొలగించడంతో అమ్మవారి విశ్వరూప ప్రదర్శన ప్రారంభమైంది. అక్కడి నుండి పాటపేట, పైబాట, హెచ్ పి రోడ్డు, నేతాజీ రోడ్డు, కొత్తపేట వీధుల్లో ఊరేగింపు జరిగింది. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ల భక్తుల దర్శనానికి దూరమైన అమ్మవారు ఈ ఏట కరుణించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. మంగళ వాయిద్యాలు, డ్రమ్స్, పలక డ్యాన్స్, యువకుల ఉత్సాహం, యువతుల నృత్యాల మధ్య అమ్మ శిరస్సును ఊరేగింపు జరిగింది. అమ్మ వారి విశ్వరూపాన్ని చూడడానికి జిల్లా ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి అడుగడుగునా గొర్రెలను, కోళ్లను, మేకలను భక్తులు బలి ఇచ్చారు. దింతో కుప్పం పట్టణ రోడ్లు అన్ని రక్తంతో తడసిపోయింది.
- పటిష్ట బందోబస్త్ చేపట్టండి - ఎస్పీ రిశాంత్ రెడ్డి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్త్ చేపట్టాలని పోలీస్ సిబ్బందికి చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయాన్ని సందర్శించి సిబ్బంది పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేట్లును పరిశీలించారు. బుధవారం అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు