మా జెండా అజెండా ప్రజా సంక్షేమమే..!

- సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
సత్యవేడు, త్రిశూల్ న్యూస్ : 
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా కొనసాగింది, గ్రామ గ్రామానా ప్రజలు ఎదురేగి తమ నాయకులకు స్వాగతం పలికారు. అధికారులు, నాయకులు తమ ఇంటికి వచ్చి సమస్యల గురించి అడుగుతుంటే ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా నాగలపురం మండలంలోని సురుటుపల్లి, కారణి గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గడప గడపకు వెళ్లి ఎమ్మెల్యే సమస్యలను అడిగి తెలుసుకుని సాధ్యాసాధ్యాలును బట్టి తక్షణం పరిష్కరించారు. మరికొన్ని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని మూడేళ్లలోనే సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారన్నారు, కరోనా ప్రతికూల పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.1.41 లక్షల కోట్లు జమచేసి వారికి బాసటగా నిలవడాన్ని గుర్తుచేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి సంస్కరణల ద్వారా సుపరిపాలన అందిస్తున్నారని అయన వివరించారు. అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగంలోని ప్రతి ఒక్కదాన్ని ఆచరించి చూపుతున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్‌ అని కొనియాడారు. అన్ని పదవుల్లో బడుగు, బలహీనవర్గాలను పెద్దపీట వేస్తూ సామాజిక విప్లవాన్ని సృష్టించారన్నారు. అలాంటి సీఎంపై చంద్రబాబు అన్నట్లుగా ప్రజల్లో వ్యతిరేకత ఎందుకుంటుందని ఆది ప్రశ్నించారు, మంత్రివర్గం నుంచి స్థానిక సంస్థల వరకూ 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు అపరంజి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్, రజిని మునిరత్నం, జడ్పిటిసి సుమతి, ఎంపీపీ సింధు, వైసిపి సీనియర్ నేత చిన్నదొరై, మండలానికి సంబంధించిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు వైసీపీ శ్రేణులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు