పద్మ కుటుంబానికి న్యాయం చేస్తాం..!
- స్పందించిన మహిళా కమిషన్ మెంబర్ గజ్జల లక్ష్మి
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
పద్మ అదృశ్యం అయిన విషయం కొద్ది రోజుల క్రితం మహిళా కమిషన్ కి మెయిల్ ద్వారా తమ బంధువులు ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదును తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి రెఫర్ చేసి మహిళ ఆచూకీ కనుగొనాలి అని మహిళా కమిషన్ కోరింది. ఈరోజు వెంకటాపురం చెరువులో పద్మ మృతదేహం లభించింది. విషయం తెలిసిన వెంటనే మహిళా కమిషన్ సభ్యురాలు తీవ్ర ధిగ్బ్రాంతి వ్యకం చేశారు . ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పద్మ తల్లిదండ్రులు ఉన్నారని తెలుసుకున్న మహిళా కమిషన్ మెంబర్ గజ్జల లక్ష్మి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పద్మ తల్లిదండ్రులను ఓదార్చారు వారికి ధైర్యం చెప్పారు. పద్మ హత్యకు ఎవరైతే పాల్పడ్డారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పద్మ కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. తిరుపతి ఎస్పి గారిని కలిసి పద్మ హత్యకు ఎవరైతే పాల్గొన్నారో వారికి కఠినంగా శిక్షించాలని కోరారు మహిళా కమిషన్ మృతురాలి కుటుంబానికి అండగా వుంటుందని తెలియజేశారు. పద్మని హత్య చేసిన భర్త వేణుగోపాల్ మరియు హత్యకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయించారు. మహిళా కమిషన్ మెంబర్ గజ్జల లక్ష్మికి పద్మ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా కమిషన్ చొరవ వల్లే తమ కూతురును హత్య చేసి మూటలో కట్టి చెరువులో వేసిన ఘటన బయటకు వచ్చిందని అలాగే నిందితులు శిక్ష నుండి తప్పించుకోకుండా చూడాలని మహిళా కమిషన్ మెంబర్ గజ్జల లక్ష్మిని కోరిన మృతురాలి తల్లిదండ్రులు.
Comments
Post a Comment