మోగిన అనంత ఎన్నికల నగారా..!
- ఈ నెల 31న టౌన్ బ్యాంక్ ఎన్నికలు
- ప్రచారానికి సిద్ధమైన అభ్యర్థులు
- సంఖ్య కేటాయింపులో కాస్త మార్పులు
- మురళి ప్యానల్ గెలుపు లాంఛనమేనా..!
అనంతపురం, త్రిశూల్ న్యూస్ :
తరచూ వాయిదా పడుతున్న అనంతపురం టౌన్ బ్యాంక్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ఎట్టికేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 31వ తేదీన ఓటింగ్ జరగనుంది. కచ్చితంగా ఎన్నికలు జరపాలని హైకోర్టు ఉత్తర్వులు ఉండడంతో ఓటమి భయంతో ఎన్నికలు జరగకుండా కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్నికల నిర్వహణ ప్రారంభమైనందున వెంటనే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, కార్పొరేటర్ గా జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యునిగా వివిధ హోదాల్లో పనిచేసిన జేఎల్ మురళి అన్ని వర్గాల మద్దతుతో అనంత టౌన్ బ్యాంక్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాలతో టిడిపిలో జేఎల్ మురళి చేరారు. గత టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన జేఎల్ మురళి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల గోదాలో దిగారు. రాయల్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా, కాపు యువత రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన జేఎల్ మురళి బలిజ సామాజిక వర్గంలో సైతం బలమైన నేతగా ఎదిగారు. ఆయన ప్యానల్ ఎన్నిక నల్లేరు మీద నడకేనని భావిస్తున్న తరుణంలో... ఆయన ప్రత్యర్థులు ఎన్నికలు అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేశారని మురళి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నికలు జరుగుతున్నా సాధారణ ఎన్నికల కన్నా ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీలోని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం, జేఎల్ మురళి వర్గం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో జేఎల్ మురళి తన గెలుపుకు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తు న్నారు. మొదటి నుండి మాజీ ఎమ్మెల్యేకు మద్దతిస్తున్న సిపిఐ పార్టీ ఈసారి జేఎల్ మురళి వర్గానికి మద్దతు ప్రకటించింది. ఆయన ప్యానల్ తరపునే ముగ్గురు సిపిఐ డైరెక్టర్లు పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీలో కొనసాగుతున్న రొళ్ల భాస్కర్, బీజేపీ మద్దతు దారుడైన మాది శెట్టి చంద్రశేఖర్ లు జేఎల్ మురళి నేతృత్వంలోని ప్యానెల్ తరపున పోటీ చేస్తున్నారు. టిడిపి నాయకులు షకీల్ షఫీ, బుగ్గయ్య చౌదరి, సుధాకర్ నాయుడు, రాయల్ మురళి తదితరులు మురళికి మద్దతు ప్రకటించారు. వరుస క్రమంలో మురళీ ప్యానల్ డైరెక్టర్లు ఉన్నారని ప్రభాకర్ చౌదరి వర్గం ఆందోళనకు దిగడంతో పది రోజుల పాటు వాయిదా వేసిన జిల్లా కలెక్టర్ కొత్త బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారిని ఆదేశించింది.
- టౌన్ బ్యాంక్ ను పటిష్ట పరిచాను - జేఎల్ మురళి
అప్పుల్లో ఉన్న టౌన్ బ్యాంకును లాభాల బాటలో నడిపించిన ఘనత తనదేనని టౌన్ బ్యాంక్ చైర్మన్ రేసులో ఉన్న జేఎల్ మురళి స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పురాతన భవనంలో టౌన్ బ్యాంక్ కు అధునాతన భవంతిని తన హయాంలోనే నిర్మించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రూ. 5 కోట్ల డిపాజిట్లను 100 కోట్లను చేసి బ్యాంకు అభివృద్ధి పథంలో నడిపించాన్నారు. ముస్లిం, బడుగు బలహీన వర్గాలకు విరివిగా లోన్లు ఇచ్చానని ఆ విషయంను ప్రత్యర్ధులే బహిరంగ వేదికలపై మాట్లాడినది నిజం కాదా అని మురళి ప్రశ్నించారు.
- బ్యాంకులో అవకతవకలు జరిగాయాంటున్న జేఎల్ మురళి ప్రత్యర్థి వర్గం
గత పాలకమండలిలో అనేక అవకతవకలు,
కుంభకోణాలు జరిగాయని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. అందువల్లనే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి అర్హత లేదన్నారు.
Comments
Post a Comment