ఏసీబీకి చిక్కిన విద్యుత్ అధికారులు..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
విద్యుత్ మీటర్లు ఇవ్వడానికి లంచం అడిగిన ఏఈ, లైన్ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్‌పల్లికి చెందిన భాస్కర్ అనే గుత్తేదారు 20 విద్యుత్ మీటర్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. సనత్ నగర్ విద్యుత్ శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న అవినాష్ రూ. 25 వేలు, లైన్ ఇన్‌స్పెక్టర్ కృపానంద్ రూ. 7,500 లంచం డిమాండ్ చేశారు. ఇందులో కొంత నగదును భాస్కర్ ఇప్పటికే ముట్టజెప్పారు. ఆ తర్వాత 5 మీటర్లు మంజూరు చేశారు. మిగతా డబ్బులిస్తేనే మరో 15 మీటర్లు మంజూరు చేస్తామని అధికారులు డిమాండ్ చేశారు. దీంతో భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏఈ, లైన్ ఇన్‌స్పెక్టర్‌కు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు