అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలి - పవన్ కళ్యాణ్
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్న పవన్..ఆ మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికే సమస్యలు సృష్టిస్తున్నారని.. పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఎవరనేది రాష్ట్ర ప్రలజందరికీ తెలుసన్నారు. హోంమంత్రి చేసిన ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావనను ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ లోపాలు, వైకాపా వైఫల్యాలను జనసేనపై రుద్దడం సరికాదన్నారు.
Comments
Post a Comment