ఆకస్మికంగా గ్రామ సచివాలయం తనిఖీ
- సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలి
- గ్రామ సచివాలయ సిబ్బందికి ఆదేశించిన జిల్లా కలెక్టర్ గిరీషా
బి.కొత్తకోట, త్రిశూల్ న్యూస్
ప్రజల దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ గ్రామ సచివాలయ ఉద్యోగులకు సూచించారు. సోమవారం బి.కొత్తకోట మండలం, గట్టు సచివాలయంను జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు అంతా సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు. సచివాలయం తనిఖీలో మదనపల్లె ఆర్ డిఓ మురళి, బి.కొత్తకోట తహసీల్దార్ ధనుజేయలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment