పిఎస్ఎల్వీ -53 రాకెట్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట, త్రిశూల్ న్యూస్ :
నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ53 దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం. ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి.
Comments
Post a Comment