సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలి..!
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ తిరుపతి విభాగం ఆధ్వర్యంలో ఆర్టీఐ పై అవగాహన, నూతన సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమం యూత్ హాస్టల్ ఆవరణలో నిర్వహించారు. లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంకు ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ మార్కండేయరెడ్డి, న్యాయ సలహాదారు దినేష్ హాజరై నూతన సభ్యులకు ముఖ్య సలహాలు, సూచనలు అందజేశారు. నూతన సభ్యుల దగ్గర అఫిడవిట్ అందుకుని గుర్తింపు కార్డులు అందజేశారు. సీసీఆర్ ప్రతినిధి గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 లో వచ్చినప్పటికీ, ఇప్పటికి గ్రామ స్థాయిలో చాలా మందికి కనీసం దరఖాస్తు చేయడం కూడా అవగాహనా లేకుండా ఉందన్నారు. ఆర్టీఐపై చట్టంపై ప్రజల్లో అవగాహన కొరుకు, అవినీతి, అక్రమాలు, అలసత్వం, అన్యాయం, అశ్రద్ధ రూపు మాపడం కోసం సీసీఆర్ కృషి చేస్తుందని తెలిపారు. దేశానికి గ్రామాలే పట్టు కొమ్మలు అన్న చందాన గ్రామస్థాయి నుండి సీసీఆర్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని, తద్వారా మెరుగైన ప్రజా ప్రయోజనం కలుగుతుందని సీసీఆర్ సభ్యులు తెలిపారు. కేంద్ర కమిటీ సూచనలతో కార్యక్రమం చేసే విషయంలో సంస్థకు, అధికారులపై తమకు ఎలాంటి విబేధాలు లేవని, కేవలం ప్రజా సంక్షేమము కొరకే సంస్థ పని చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం చట్టాలు రూపొందిచారని వాటిని సక్రమంగా అమలుచేయడం కోసం తమ వంతు కృషి ఉంటుందని సభ్యులు తెలిపారు. మహిళలు ముఖ్యంగా చట్టం పట్ల అవగాహన పెంచుకోవాలి అని మహిళా విభాగం ప్రతినిధి గిరిజ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, చెన్నయ్య, వేణు, గిరిధర్ రెడ్డి, వెంకట్రామయ్య, అమర్నాధ్, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment