సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి
- జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియ వేగవంతం చేసి ఈనెల 30 లోపల పూర్తిచేయాలని, అదేవిధంగా వివిధ శాఖల ఉద్యోగుల బదిలీలు ఆయా శాఖల అధికారుల నిబంధనల మేరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డి ఆర్ వో ఎన్ .రాజశేఖర్ లతో కలసి వివిధ శాఖాధిపతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రొబేషన్ ఈ నెల 30తో ముగుస్తుందని.. వారికి ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్, గ్రామ రెవెన్యూ అధికారులకు సంబంధించి కలెక్టర్ జారీ చేస్తారని, గ్రామ సర్వేయర్లకు సంబంధించి సర్వేశాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవనశాఖ సిరికల్చర్ విభాగాలకు సంబంధించి సంబంధిత విభాగాల అధిపతులు.. ఎనర్జీ అసిస్టెంట్ లకు సంబంధించి విద్యుత్ శాఖ అధిపతి, ఏఎన్ఎం లకు రీజనల్ డైరెక్టర్ మెడికల్ హెల్త్ వారు, వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, శానిటేషన్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అసిస్టెంట్ విభాగాలకు సంబంధించి ప్రాంతీయ అధికారులు, కమ్యూనిటీ సెక్రటరీకి సంబంధించి పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ , ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ కి సంబంధించి ప్రాంతీయ టౌన్ ప్లానింగ్ అధికారి, ఎనర్జీ సెక్రటరీ కి సంబంధించి విద్యుత్ శాఖ ఉన్నత అధికారి, హెల్త్ సెక్రటరీ కి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్ లు ప్రొబేషన్ డిక్లరేషన్ కు సంబంధించి అనుమతులు ఇవ్వనున్నామన్నారు. సంబంధిత శాఖ అధికారులు తయారు చేసిన జాబితాలను జిల్లా కలెక్టర్ ఆమోదం పలుకుతారు. దీని ద్వారా జూలై 1 నుంచి సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులుగా కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా వివిధ శాఖల నుంచి బదిలీల కొరకు దరఖాస్తు చేసుకున్న సిబ్బంది ఆయా శాఖల నియమావళి మేరకు నడుచుకోవాల్సి ఉంటుందని, బదిలీ అయిన ఉత్తర్వులకు సంబంధించి ఆయా శాఖల వారు కలెక్టర్ ఉత్తర్వులను పొందాల్సి ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటరావు, జిల్లా పంచాయతీ అధికారి దశరథరామిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, లేడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ లత, ఎస్ ఈ పంచాయతీ రాజ్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ ఈ ఆర్డబ్ల్యూఎస్ వెంకటరమణ, చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి డాక్టర్ రమేష్,ఏ డి హార్టికల్చర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment