వైసిపి పాలనలో ప్రతి సంక్షేమ పథకం మహిళలకే మంజూరు..!
- మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి
వి. కోట, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలోని ప్రతి మహిళ పొదుపు అవర్చుకున్నప్పుడు వారి కుటుంభాలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహద పడుతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల కేంద్రమైన వికోటలో నిర్వహించిన అమ్మాక్ట్స్ మహిళా పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం 25 వ మహాసభ సమావేశానికి అయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి qతన పాలనలో ప్రతి సంక్షేమ పథకం మహిళలకే మంజూరు చేయడాన్ని వారికి మహిళల పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని మోసం చెయ్యడాన్ని మహిళా సంఘాలు ఎప్పటికీ మరచిపోరన్నారు.జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు డ్వాక్రా సంఘాల మహిళలకు ఇచ్చిన హామీ మేరకు విడతలవారీ రుణమాఫీ చేసి చూపారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో గడచిన 25 సంవత్సరాల నుండి వి కోటలొ దశరథరెడ్డి అమ్మాక్ట్స సంస్థను స్థాపించి ఆంధ్రా, కర్నాటక తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా గ్రూపు సభ్యులను సంఘాలుగా ఏర్పాటు చేసి ఆర్థిక సహకారాన్ని అందించి వారిని ఆర్థిక శక్తిగా బలోపేతం చేశారని కొనియాడారు. వారు కరోన సమయంలో అందించిన సహకారంతో పాటు విద్య, ఆరోగ్యానికి అందిస్తున్న తోడ్పాటుకు ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారిలో చైతన్యం నింపి క్రమశిక్షణతో సమాజసేవలో ముందుకెళ్తున్న దశరథరెడ్డి సేవలు ఎక్కువ రంగాల్లో విస్తరించాలని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడా కోరారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ప్రజల సౌకర్యాం కోసం అధునాతన సదుపాయాలతో మరుగుదొడ్ల నిర్మాణానికి దశరథరెడ్డి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తన సేవలతో మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న దశరథరెడ్డి సేవలను ఎం పి రెడ్డెప్ప కొనియాడారు. మారుమూల వెనుకబడిన ప్రాంతాలైన పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో మహిళలను చైతన్య పరిచేందుకు సంస్థ చేసిన కృషిని జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు కొనియాడారు. సంస్థ సహకారంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దశరథరెడ్డి తన సేవలను మరింత విస్తరించాలని ఎమ్మెల్సీ భరత్ కోరారు .ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు 10 లక్షల రూపాయలకు పైగా ఉపకార వేతనాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు మహిళా సంఘాలు ప్రభుత్వ పాలకులు సహాయ సహకారాలందించాలని దశరథరెడ్డి కోరారు .ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పీఎన్ లక్ష్మి, ఎంపీపీ యువరాజ్, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పిన్ నాగరాజు, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి రెడ్డప్పతో పాటు పెద్ద ఎత్తున మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Post a Comment