పోలీసుల గుప్పెట్లో భాగ్యనగరం..!

- 4వ తేదీ వరకు144 సెక్షన్ అమలు

- బిజెపి అగ్రనేతల రాకతో భారీ బందోబస్త్
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. అలాగే మోడీ బహిరంగ సభకు "విజయ సంకల్ప సభ"గా నామకరణం చేసినట్లు బిజెపి ఎంపి లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణ గడ్డ మీద భాగ్యనగర్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని, బిజెపి అగ్ర నాయకత్వం హాజరు అవుతున్న ఈ సమావేశం చారిత్రాత్మక సమావేశాలు అని తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రధాని మోడీ పరేడ్‌ గ్రౌండ్‌ బహిరంగ సభలో ప్రసగిస్తారు. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు హైదరాబాద్ పోలీసులు అలాగే నో ఫ్లయింగ్ జోన్స్ ను ప్రకటించారు. గురువారం సాయంత్రం నుంచి జూలై 4వ తేదీ ఉదయం వరకు హైదరాబాద్ లో 144 సెక్షన్ అమలు కానుంది. హైదరాబాద్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్ అలాగే రాజ్ భవన్ పరిసరాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని నోవాటెల్ వరకు నో ఫ్లయింగ్ గా ప్రకటించారు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంగిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు