సోషల్ మీడియా అంటే సిఎం జగన్ కు వణుకు - నారా లోకేష్
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం వైఎస్ జగన్‌కు మీడియాని చూస్తే భయం, సోషల్ మీడియా అంటే వణుకు అంటూ సెటైర్లు వేశారు.. చివరికి యూట్యూబ్ ఛానెల్ థంబ్ నైల్ చూసి జడుసుకునే జగన్ సింగిల్ గా వచ్చే సింహమా..! వీధి కుక్క కూడా కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఈ మాదిరి పిరికోడికి నా వెంట్రుక పీకలేరంటూ పిల్లల ముందు బిల్డప్ ఎందుకు? కనీసం ఐడెంటిటీ లేకుండా అర్ధరాత్రి దొంగల్లా గోడ దూకడం, గునపాలతో తలుపులు పగుల గొట్టిన కొంత మంది పోలీసులు వైసీపీ గూండాలను మించిపోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామవాసి, టీడీపీ కార్యకర్త, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు వెంకటేష్ ఇంట్లోకి చొరబడి దాడి చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు నారా లోకేష్.. కనపడకుండా ఉండటానికి లైట్లు పగలగొట్టిన పోలీసుల మొఖాలన్నీ స్పష్టంగా వీడియోలో రికార్డయ్యాయి.. జగన్ ప్రాపకం కోసం చట్టాన్ని అతిక్రమించి అడ్డదారులు తొక్కుతున్న వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు.. కాగా, పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటలో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గార్లపాటి వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్నారు సీఐడీ అధికారులు. వెంకటేష్ యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారు.. ఆయన కంప్యూటర్ కూడా సీఐడీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారని అతనిపై సీఐడీ కేసులు పెట్టిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Comments
Post a Comment