వామ్మో ఎలుగుబంట్లు..!
- కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్ల కలకలం
- రోజుకు ఒకచోట మనుషులపై దాడులు
- వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించాలని ప్రజల విన్నపం
కళ్యాణదుర్గం, త్రిశూల్ న్యూస్ :
ఒకటి కాదు ..రెండు కాదు... పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు సంచరిస్తున్న కళ్యాణదుర్గం ప్రాంతంలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రోజుకోచోట ఎలుగుబంట్లు ప్రజలపై దాడి చేస్తూ గాయపరుస్తుండటం కలకలం రేపుతున్నాయి. వరుసగా రెండు నెలలుగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పొలాల్లోకి వెళుతున్నారు. తాజాగా కంబదూరు మండలం ఎర్రబండ గ్రామంలో మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. సమీపంలోని అడవి ప్రాంతం నుంచి గ్రామ సమీపంలోకి వచ్చిన ఎలుగుబంటి పొలంలో పనులు చేస్తున్న మహిళపై హఠాత్తుగా దాడి చేసింది. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా వదలకుండా భయభ్రాంతులకు గురి చేసిన ఎలుగుబంటి గ్రామస్తుల మూకుమ్మడి దాడితో పరుగులు తీసి పారిపోయింది. అయితే ఇలాంటి సంఘటనలు నిత్య కృత్యమయ్యాయి. అటవీశాఖ అధికారులు వన్య ప్రాణుల నుంచి తమను రక్షించాలని గ్రామీణ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. పదుల సంఖ్యలో ఉన్న ఎలుగుబంట్లును బంధించి దూర ప్రాంతంలోని అరణ్యానికి తీసుకెళ్లాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలుగుబంట్ల దాడి చేసిన వారు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మున్ముందు ప్రాణాపాయం కూడా ఉందని బాధితులు వాపోతున్నారు. తీవ్ర నష్టం జరగక మునుపే అటవీ శాఖ అధికారులు స్పందించి తగిన రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.
Comments
Post a Comment