పోలీసులపై ఫిర్యాదుల కోసం కార్యాలయాలను ఏర్పాటు చేయండి
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
పోలీసులపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్రంలో పోలీసు కంప్లైంట్ అథార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీసు కంప్లైంట్ అథార్టీలను ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను అందుకుని వాటిని పరిష్కరించే నిమిత్తం రాష్ట్రంలో జిల్లా పోలీసు కంప్లైంట్ అథార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. విశాఖపట్నానికి చెందిన న్యాయవాది ఎం.మనోజ్‌కుమార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీసు కంప్లైంట్ అథార్టీలను ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. పోలీసు శాఖలో సంస్కరణల కోసం, పోలీసులపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం ఈ ఆదేశాలిచ్చిందన్నారు. లాకప్ మరణం, అత్యాచారం, చిత్ర హింసలకు గురిచేయడం తదితర తీవ్రమైన విషయాల్లో ఎస్పీ, ఆపై స్థాయి హోదా కలిగిన అధికారిపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి ఆథార్టీని ఏర్పాటు చేయాలని సుప్రీం తెలిపిందన్నారు. డీఎస్పీ నుంచి కింది స్థాయి పోలీసులపై వచ్చే ఫిర్యాదులను జిల్లా పోలీసు అథార్టీ పరిష్కరిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పోలీసు కంప్లైంట్ ఆథార్టీలను ఏర్పాటు చేశాయన్నారు. ఏపీలోనూ ఏర్పాటుకు గతేడాది జులై 8న జీవో జారీచేశారన్నారు. రాష్ట్రంలోని నాలుగు జోన్లకు ఛైర్మన్లు, సభ్యులను నియమించినప్పటికీ కార్యకలాపాల నిర్వహణ కోసం కార్యాలయాలను ఏర్పాటు చేయలేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జిల్లా పోలీసు కంప్లైంట్ ఆథార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
Comments
Post a Comment