నాగలాపురం ఆర్ఐ ఉషారాణి హఠాన్మరణం
- ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంతాపం
నాగలాపురం, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా నాగలాపురం రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఉషారాణి గురువారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. అధికారుల కథనం మేరకు పుత్తూరుకు చెందిన ఉషారాణి నాగలాపురం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం ఉషారాణి కార్యాలయానికి విచ్చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు నాగలాపురం మండలంలోని బైట కొడియంబేడు సచివాలయ తనిఖీ కోసం తహసిల్దారు ప్రసన్న కుమార్ తో కలిసి ఉషారాణి వెళ్లారు. సచివాలయంలో తనిఖీ చేస్తూ ఆర్ ఐ ఉషారాణి కళ్ళు తిరిగి పడిపోయారు. తోటి ఉద్యోగులు హుటాహుటిన తహాసిల్దారు కారులో ఆమెను పుత్తూరు వైద్యశాలకు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఉషారాణి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు వల్లే మరణం సంభవించి ఉండవచ్చని వైద్యులు వెల్లడించారు. ఆర్ఐ ఉషారాణి హఠాన్మరణం పట్ల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్, మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ అపరంజి రాజు, రైతు సలహా మండలి చైర్మన్ చిన్నదురై లతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
Comments
Post a Comment