జనసేన సేవకే గాని.. సంపాదనకు కాదు..!

- రాబోయే ఎన్నికల్లో వైసీపీ గద్దె దిగడం ఖాయం 

- జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : 
కార్వేటి నగరం మండల కేంద్రంలో ఇటీవల అకస్మాత్తుగా మరణించిన దాము రాయల్ కుటుంబాన్ని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న పరామర్శించారు. ఒక్కగానొక్క కుమారుడు దాము రాయల్ ఆకస్మికంగా మరణించడం కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.వేలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో జనసేన అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షురాలు సెల్వి అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను పరామర్శించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రూ.5 వేలు ఆర్థిక సహాయం చేశారు. మానవసేవయే మాధవసేవ అని జనసేన పార్టీ సేవకే.. గాని సంపాదనకు కాదని ఉద్ఘాటించారు. కాపులకు అగ్రపీఠం వేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కాపు నేస్తంలో 42వేల పేర్లు గల్లంతు చేశారని మండిపడ్డారు. కాపులకు అండగా నిలబడేది జనసేన పార్టీ మాత్రమేనని.. ఈసారి కాపులంతా ఏకమై పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని నియోజకవర్గంలో ఉన్న కాపు సామాజిక వర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజధాని భూములను అమ్మడం, మూడు రకాల బ్రాండ్లలో ప్రమాదకరమైన, హానికరమైన రసాయనాలను కలిపి అమ్మడం, చీకటి జీవోలు జారీ చేయడం, దివ్యాంగులపై దాడి చేయడం, ప్రశ్నిస్తే పాలు, నీళ్లు లేకుండా చేయడం, ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడటం, పెరిగిపోతున్న రాష్ట్ర అప్పులు, రెవెన్యూ లోటు ఇదంతా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. త్వరలో వైసిపిని ఈ రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, పట్టణ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు విజయ్, అన్నామలై, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, నరేష్, దేవా, కార్యదర్శులు శివ, శేఖర్, వడివేలు, అజిత్, మోహన్, జనసైనికులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు