మహారాష్ట్ర సీఎంగా శిందే ప్రమాణ స్వీకారం

- డిప్యూటీ సీఎంగా ఫడణవీస్ 
ముంబయి, త్రిశూల్ న్యూస్ :
మహారాష్ట్రలో గత తొమ్మిది రోజులుగా కొనసాగిన తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపా, శివసేన తిరుగుబాటు వర్గం కలవడంతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరితో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. శివసేన నుంచి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మొదలైన సంక్షోభం తీవ్రస్థాయిలో కొనసాగడంతో నిన్న ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేశారు. దీంతో 2019లో శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీలు కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గురువారం భాజపా-శివసేన రెబల్‌ వర్గం ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల క్రమంలో గురువారం రెండు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్‌ రాజీనామాతో తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ అవుతారని, శివసేన తిరుగుబాటు నేత శిందేకు డిప్యూటీ సీఎం ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే, ఈ సాయంత్రం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాను సీఎం పదవి చేపట్టడంలేదని, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండనన్న ఫడణవీస్‌.. కొత్త సీఎం ఏక్‌నాథ్‌ శిందే అని ఈ సాయంత్రం 4.30గంటల సమయంలో ప్రకటించారు. అయితే, ఫడణవీస్‌ అలా ప్రకటించిన మూడు గంటల వ్యవధిలోనే భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఫడణవీస్‌ ప్రభుత్వ ఏర్పాటులో భాగం కావాలని.. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు. దీంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు