అగ్నిపథ్‌ పథకం దేశ భద్రతకు ముప్పు..!

- డిసిసి అధ్యక్షులు డాక్టర్ బి ఆర్ సురేష్ బాబు
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కేంద్రం ప్రభుత్వం తీసుకువస్తున్న అగ్నిపథ్‌ పథకాన్ని సత్వరం ఉపసంహరించుకోవాలని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేశారు. సోమవారం అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష పాల్గొన్న సురేష్ బాబు మాట్లాడుతూ త్రివిధ దళాల్లో నాలుగేళ్ల ఒప్పంద పద్ధతిన యువకులను చేర్చుకొనే అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్రప్రభుత్వం చేపట్టింది... దాని అమలుతో దేశ రక్షణ రంగం నిర్వీర్యమవుతుందని, నాలుగేళ్లు పనిచేసిన యువకులకు తదుపరి భవిష్యత్తు ఉండదన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే దేశాన్ని సర్వనాశనం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకొన్నదని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అగ్నిపథ్‌ ఓ అనాలోచితమైన నిర్ణయమని ఎద్దేవా చేస్తూ.. అగ్నిపథ్‌ పై అధికార వైసిపి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బిజెపిని చూస్తే ఎందుకు వైసిపికి అంత భయం అన్నారు. సైన్యంలో 1,22,000 ఖాళీగా ఉన్నాయని 22 సంవత్సరాలు దాటిన తర్వాత యువత ఏం చేయాలని ప్రశ్నించారు. యువకులకు ఉద్యోగం ఇవ్వడానికి అన్ని అడ్డంకులా అని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న వాగ్దానం ఏమైందిని నిలదీశారు. అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు