ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
భారతదేశం 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది. ఆ రోజు నుంచే ప్రారంభంకానున్న నామినేషన్ల దాఖలు ప్రక్రియ జులై 19తో ముగియనుంది.20న అధికారులు వాటిని పరిశీలించనున్నారు. 22వ తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఒకరికి మించి అభ్యర్థులు పోటీలో ఉంటే ఆగస్టు 6న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. కొత్త వైస్ ప్రెసిడెంట్ ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనుంది. 233మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12మంది నామినేటెడ్ సభ్యులు, 543మంది లోక్సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
Comments
Post a Comment