ప్రశాంతంగా గ్రూప్ 1V పరీక్షలు - జిల్లా కలెక్టర్
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన గ్రూప్ 1V పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. చిత్తూరు కేంద్రంగా 3900 మంది పరీక్ష రాయాల్సి ఉండగా వారి కోసం 11 కేంద్రాలను పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 11 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3900 మంది దరఖాస్తు చేసుకోగా 2265 మంది పరీక్షలను రాయడం జరిగింది. మరో 1635 మంది గైర్హాజరు అయ్యారు మొత్తం 58.07% మంది పరీక్షలకు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ పట్టణంలోని విజయం జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, అపోలో మెడికల్ కాలేజీ, శ్రీ శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహణ విధానంను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. రాజశేఖర్ తో పాటు ఇతర అధికారులను నియమించారు. కువైట్ నిబంధనలను అనుసరించి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పరీక్షలను నిర్వహించారు.
Comments
Post a Comment