ప్రియుడితో తిరిగి వచ్చిన సాయి ప్రియాంక..!
విశాఖపట్నం, త్రిశూల్ న్యూస్ :
విశాఖపట్నం బీచ్ లో భర్తకు మస్కాకొట్టి ప్రియుడితో పారిపోయిన సాయి ప్రియాంక తిరిగి వైజాగ్ వచ్చింది. ప్రియుడ్ని రెండో పెళ్లి చేసుకొని బెంగళూరు వెళ్లిన సాయి ప్రియాంకను పోలీసులు తీసుకొచ్చారు. పోలీసులు, మీడియా హడావిడి మధ్య ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సాయిప్రియాంక చేసిన పనిపై మీడియా నిలదీసింది. ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపోయిందని ప్రశ్నించగా.. అందుకు తమను క్షమించాలని రవి కోరాడు. అలాగే సాయి ప్రియాంకకు భర్త ఇచ్చిన రెండు గాజులు ఏం చేశారని ప్రశ్నించగా.. గాజులు తమ దగ్గరే ఉన్నాయని తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. తమకు తల్లిదండ్రుతో కలిసి ఉండలేమని.. ప్రియాంకను తానే పోషింస్తానని రవి సమాధానమిచ్చాడు. మరోవైపు ఇద్దర్నీ వైజాగ్ త్రీటౌన్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు వారిద్దరి వివరాలను నమోదు చేసుకున్నారు. ఇరువైపుల పెద్దలను పిలిపించి మాట్లాడారు. ఐతే వీళ్ల వల్ల తమ పరువు పోయిందని తీసుకెళ్లేది లేదని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండే ప్రియాంక భర్త దీనిపై ఇంకా స్పందించలేదు. అటు సాయిప్రియాంక పేరెంట్స్ గానీ, రవి తల్లిదండ్రులు కూడా స్పందించలేదు. విశాఖపట్నంకు చెందిన శ్రీనివాస్ కు రెండేళ్ల క్రితం సాయి ప్రియాంకతో పెళ్లయింది. ప్రస్తుతం శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేతుండగా.. ప్రియాంక మాత్రం విశాఖలో ఉండి చదువుకుంటోంది. ఈనెల 25న పెళ్లి రోజు కావడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రీనివాస్.. భార్యకు బంగారు గాజులు గిఫ్టుగా ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ సింహాచలం గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం రెస్టారెంట్ కు వెళ్లి లంచ్ చేసిన తర్వాత సాయంత్రం విశాఖ బీచ్ కు వెళ్లి సరదాగా గడిపారు. ఇద్దరూ సెల్ఫీలు తీసుకొని ఉత్సాంగా ఉన్నారు. రాత్రి 8గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా శ్రీనివాస్ ఫోన్ కు మెసేజ్ రావడంతో మొబైల్ చూసుకుంటూ నడుస్తున్నాడు. ఇంతలో కాళ్లు కడుక్కొని వస్తానంటూ మళ్లీ బీచ్ వద్దకు వెళ్లిన సాయి ప్రియాంక ఆ తర్వాత కనిపించలేదు. దీంతో తన భార్య బీచ్ లో గల్లంతయిందంటూ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాద చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆమెను గాలించడం మొదలుపెట్టారు. ఐతే ఎక్కడో తేడా కొడతుందని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా.. భర్తను మాయ చేసి ప్రియుడితో పారిపోయినట్లు గుర్తించారు. తొలుత నెల్లూరులో ఆచూకీ కనిపెట్టగా.. ఆ తర్వాత తాను బెంగళూరులో ఉన్నానని.. ప్రియుడి రవిని పెళ్లి చేసుకున్నానంటూ ప్రియాంక తన తండ్రికి వాయిస్ మెసేజ్ చేసింది. ఫోటోలు కూడా పెట్టింది. దీంతో బెంగళూరు వెళ్లిన పోలీసులు ఇద్దర్నీ వెంటబెట్టుకొచ్చారు.
Comments
Post a Comment