దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే..?

- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో 

            త్రిశూల్ న్యూస్ :
'దెయ్యాలు వేదాలు వల్లించినట్లు'.. 'నీతులు ఉన్నవి ఇంకొకరికి చెప్పడానికే.. కానీ, మనం పాటించడానికి కాదు' అన్నట్లు.. ఉంది వీరి వ్యవహారం. చెట్లను కొట్టేసి వాటి దుంగలను లారీలో వేసుకుని వెళ్తున్నారు కొందరు. ఆ లారీ వెనకాల మాత్రం 'మరిన్ని చెట్లను నాటండి' అని రాసుకు వచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వ అధికారి అవానిశ్ శరణ్ ఆ లారీ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'వ్యంగ్యానికి నిర్వచనం ఇదే'నంటూ ఆయన చురకలంటించారు. అవానిశ్ శరణ్ సామాజిక మాధ్యమాల్లో చురుకుంటా ఉంటూ ఇటువంటి పోస్టులు తరుచూ చేస్తుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.
నెటిజన్లు ఆ ఫొటోపై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'చెట్లను కొట్టేసి తీసుకెళ్తూ మరిన్ని చెట్టను నాటండి అని రాశారేంటీ? మేము నాటుతోంటే మీరు కొట్టుకెళ్తారా?' అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. 'ఈ సీన్ సినిమాలోనూ పెట్టుకోవచ్చు' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'చెట్లను పెంచేది మీరు కొట్టేయడానికేనా?' అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 'కొట్టేసిన చెట్లు సరిపోలేదా? మరిన్ని చెట్లను మీ కోసం పెంచి ఉంచాలా?' అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు