సచివాలయంలో గేదలు..!

- స్పందన అర్జీలకు స్పందించిన అధికారులు 

- గుంటూరు నగర పాలక సంస్థలో వింత పంచాయతీ
గుంటూరు, త్రిశూల్ న్యూస్ :
'స్పందన' కార్యక్రమంలో ఓ అర్జీదారుడి
దెబ్బకు శానిటరీ సూపర్వైజర్.. రైతు గేదెలను తీసుకొచ్చి సచివాలయం వద్ద కట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగర పాలకసంస్థ పరిధిలోని ఏటుకూరు ప్రాంతానికి చెందిన ఓ అర్జీదారు.. తన ఇంటి పక్కన ఉన్న గేదెలతో వాసన
వచ్చి ఇబ్బంది పడుతున్నానంటూ ఏడాది కాలంగా తరచూ అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో శానిటరీ సిబ్బంది పలుమార్లు గేదెల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినా స్పందనలేదు. దీనిపై వారు న్యాయస్థానం వరకు కూడా వెళ్లారు. అయితే తరచూ ఇదే సమస్యపై స్పందనలో ఫిర్యాదు రావటంతో చేసేదేమీ లేక శానిటరీ సూపర్ వైజర్ వెంకటేశ్వరరావు.. రైతు శ్రీనివాస్ కు చెందిన గేదెలను తీసుకొచ్చి సమీపంలోని సచివాలయం వద్ద కట్టేశారు. స్పందన అర్జీ పరిష్కరించకుంటే తనను సస్పెండ్ చేస్తారని, అందుకే ఇలా గేదెలను తీసుకొచ్చి సచివాలయం వద్ద కట్టేశామని శానిటరీ సూపర్ వైజర్ చెబుతున్నారు. వాటి పాలను తీసుకోవాలని సదరు రైతుకు సూచించామన్నారు. రైతుకు ఎన్ని సార్లు చెప్పినా అతను పట్టించు కోవడం లేదు అనే ఉద్దేశంతో గేదలని సచివాయానికి తీసుకువచ్చామని చెప్పారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు