Trishul News

ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని సద్వినియోగం చేసుకోండి..!

- కాపు నేస్తం ద్వారా 6565 మందికి రూ.9.86 కోట్లు లబ్ది
    
- జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ 
 చిత్తూరు, త్రిశూల్ న్యూస్ 
శుక్రవారం 3 వ విడత వై.ఎస్.ఆర్ కాపు నేస్తం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 3,38,792 మంది కాపు, తెలగ, ఒంటరి మరియు బలిజ సామాజిక కులమును చెందిన 45 నుండి 60 సం.ల వయసు మధ్య గల మహిళలకు రూ.508.18 కోట్లు లబ్దిని కాకినాడ జిల్లా గొల్లప్రోలు నుండి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి ముఖ్యమంత్రివర్యులు లబ్దిదారుల ఖాతాలకు జమ చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పేదలను పేదరికం నుండి బయటకు తీసుకుని వచ్చేందుకు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేసేందుకు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని, నేడు జిల్లాలో 3వ విడత వై.ఎస్.ఆర్ కాపు నేస్తం పథకం క్రింద 6565 మంది లబ్ది పొందుతున్నారని, ఇలా ఈ పథకం తో పాటు మిగిలిన సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న లబ్దిదారులు ఈ లబ్ధిని వారు ఆర్ధిక స్వావలంభన సాధించేందుకు అనుగుణంగా సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా జిల్లా లో 3 వ విడత వై.ఎస్.ఆర్ కాపు నేస్తం క్రింద లబ్ది పొందుతున్న 6565 మందికి రూ.9.84 కోట్ల మెగా చెక్కును ముఖ్య అతిథుల మంత్రి వర్యులు పెద్దరెడ్డి రామచద్రా రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేసారు. 
 జిల్లాలో నియోజకవార్గాల వారీగా . . చిత్తూరుకు చెందిన 846 మందికి రూ.1.27 కోట్లు, జి.డి.నెల్లూరుకు చెందిన 844 మందికి రూ.1.27 కోట్లు, కుప్పంకు చెందిన 750 మందికి రూ.1.13 కోట్లు, నగరికి చెందిన 255 మందికి రూ.0.38 కోట్లు, పలమనేరుకు చెందిన 1190 మందికి రూ.1.79 కోట్లు, పుంగనూరుకు చెందిన 1577 మందికి రూ.2.37 కోట్లు, పూతలపట్టుకు చెందిన 1103 మందికి రూ.1.65 కోట్లు మంది లబ్ది చేకూరింది.

Post a Comment

Previous Post Next Post