పోషకాహార లోపం లేకుండా చూడాలి - చిత్తూరు జిల్లా కలెక్టర్
- బాలికలలో రక్తహీనతను గుర్తించి తగిన పర్యవేక్షణ చేయాలి
- క్షయవ్యాదిని రూపు మాపేందుకు నిరంతరం జాగ్రత్త వహించాలి
- ఐ డి డి ఎస్, ఆరోగ్యశాఖ వారు సహకరించుకోవాలి
- జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
కౌమార దశలో ఉన్న బాలలకు పోషకాహార లోపం, బాలికలలో రక్తహీనత, క్షయవ్యాధి నివారణకు నేరుగా చర్యలు తీసుకొని మరణాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఐసిడిఎస్, వైద్య ఆరోగ్యశాఖలో అధికారులతో సమావేశం జరిపి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోషకాహార లోపం వల్ల చిన్న పిల్లలు, గర్భవతులు, బాలింతలు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని ఐసిడిఎస్ మరియు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఇటువంటి లోపం నివారించేలా చూడాలని అన్నారు. గర్భవతులలో రక్తహీనత ఉండటం వల్ల వారి పిల్లలు కూడా ఇబ్బందికరంగా ఉంటారని సాధారణంగా పేదలలో ఇటువంటి పరిస్థితి ఉందని ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు ఆశాలు, ఏఎన్ఎంలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఐసిడిఎస్ సిబ్బంది, ఎంఎల్ హెచ్ పీలు సమన్వయంతో పనిచేసి వారికి సరైన ఆహారం అందించేలా చూడాలని అన్నారు. చాలామందికి కాల్షియం తక్కువ ఇబ్బంది పడుతున్నారని దీనికి సంబంధించి ప్రత్యేక కారణాలు తెలుసుకోవడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలన్నారు. పోషకాహార లోపం ఆరు నెలల నుంచి 35 నెలల వయస్సు గల వరకు ఉన్న వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆ విధంగా చేయడం ద్వారా వారికి పోషక విలువలు ఉన్న ఆహారం అందించే చర్యలు తీసుకోవాలని 36 నెలల నుంచి 59 నెలల వయసుగల వారి వరకు అంగన్వాడీ కేంద్రాలలోని ఆహారం ఇవ్వాలని ప్రభుత్వం భావించిందన్నారు. ఇందుకు ప్రధాన కారణం వారికి మంచి పోషక విలువలు ఉన్న ఆహారం ఇవ్వడం వీలవుతుందని తద్వారా వారిలో మంచి పోషక విలువలు పెరిగి ఆరోగ్యవంతంగా ఉండగలరని అన్నారు. మొత్తం మీద 11 నుంచి 13 శాతం వరకు పిల్లలు పోషకాహారం, రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారని దీని ద్వారా తక్కువ బరువు ఉంటున్నారని వీటన్నింటినీ నివారించేందుకే జిల్లాలో 2420 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని ఒక్కో అంగన్వాడి కేంద్రంలో 40 మంది పిల్లలు ఉంటారని అందులో ఐదు మంది వరకు రక్తహీనత మరియు పౌష్టికాహారం లోపం వల్ల తక్కువ బరువు ఉన్నవారు ఉంటారని వారి ఆరోగ్యం పట్ల ఐసిడిఎస్ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. వీటితోపాటు గ్రామ సచివాలయాలలోనూ హెల్త్ క్లినిక్ల అనుబంధంగా ఉన్న సిబ్బంది కూడా ఆయా గ్రామాల్లో ఉన్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి ఏఎన్ఎం సచివాలయ పరిధిలో 10 రోజులకు ఒకసారి తప్పనిసరిగా గుర్తించి చిన్నపిల్లలలో ఎటువంటి లోపం లేకుండా చూడాలని అదేవిధంగా సూపర్వైజర్లు 15 రోజులు ఒకసారి వారి ఏరియాలో 50 శాతం మందిని అయినా తనిఖీ చేయాలని అన్నారు. ఎమ్ ఎల్ హెచ్ పీ లు ప్రతినెలా వీరిని తనిఖీ చేయాలని సిడిపిఓలు 10 శాతం మందిని తనిఖీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని చూడాలని అన్నారు. వైద్యాధికారులు గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఆశ లేదా ఏఎన్ఎంలు ఇటువంటి ఇబ్బందులు పడుతున్న వారిని డాక్టర్ వద్ద చూపించాలని అవసరమైతే సమీప ఆసుపత్రిలో గల చిన్నపిల్లల డాక్టర్ వద్ద చూపించి వారి ఆహార పదార్థాల్లో ఏవైనా మార్పులు చేయాలంటే ఆ విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటువంటి చర్యలు చేపట్టడం వల్ల అందరూ ఆ పిల్లలను పరిశీలించడం వల్ల వారు ఆరోగ్యవంతంగా తయారవుతారని అన్నారు.
ఇటీవల కొంతమంది క్షయ వ్యాధి వల్ల మరణించడం జరుగుతుందని అటువంటి మరణాలు జరగకుండా జాగ్రత్త పడాలని ప్రధానంగా వర్షాకాలంలోని ఈ వ్యాధులు ఎక్కువ కావడం జరుగుతుందని జలుబు దగ్గు ఎక్కువగా ఉన్న వారిని, రెస్పిరేటరీ సమస్యలు ఉన్నవారిని పరిశీలించి వారికి సరైన వైద్యం అందించగలిగితే వారిని ఆరోగ్యంగా ఉంచగలమని అన్నారు. ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్య ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, డాక్టర్లు వీరి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారికి ట్రీట్మెంట్ ఇప్పించడంలో తగిన చర్యలు తీసుకోవాలని ముందుగానే ఈ పరిస్థితులను గ్రహిస్తే వారికి మరింత మెరుగైన వైద్యం అందించవచ్చునని వీరి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించేందుకు తగు చర్యలు చేపట్టిందని అన్నారు. వ్యాధిగ్రస్తులు మందులు సకాలంలో తీసుకునేలా వైద్య సిబ్బంది వారికి అవగాహన కల్పించాలని అవసరమైతే దగ్గరుండి వారికి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రమం తప్పకుండా ఆశాలు వారిని పరిశీలించాలని వారికి పోషక విలువలు ఉన్న ఆహారం ఇప్పించాలని రెస్పిరేటరీ సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్లతో సంప్రదించి అవసరమైతే డాక్టర్ పరీక్షల ప్రాంతాల్లో ఉన్నట్లయితే అక్కడికి తీసుకెళ్లి వారికి పరీక్షలు నిర్వహించి తగిన మందులు ఇప్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే వారు ఆరోగ్యవంతంగా ఉండాలని వారు ఆరోగ్యవంతంగా ఉండాలంటే సంబంధిత సిబ్బంది వారికి అందుబాటులో ఉండాలని అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు, సచివాలయాలు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజల జీవన ప్రమాణాలతో పాటు వారి ఆరోగ్య పరిస్థితి మీద దృష్టి పెట్టి తగిన వైద్య సౌకర్యం కల్పిస్తే వారు క్షేమంగా ఉండగలరని ఆ విధంగా తగిన చర్యలు సిబ్బంది తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో ఐసిడిఎస్, వైద్య సిబ్బందిని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీహరి, ఐసిడిఎస్ పిడి నాగ శైలజ, జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి రమేష్, డి సి హెచ్ ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment