Trishul News

పట్టణంలోని ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..!

- డ్రై డే రోజు తప్పనిసరిగా ప్రతి ఇళ్లల్లో లార్వా పరిస్థితిని పరిశీలించాలి

-  నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నదో లేదో పరిశీలించాలి

- జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ 
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
ప్రస్తుతం వర్షాకాలంలో ఉన్నందున ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలిస్తూ డ్రైడే రోజున నిల్వలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. కలెక్టర్ శనివారం సాయంత్రం చిత్తూరు పట్టణంలోని 6, 7 వార్డు సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని ఇళ్లు ఉన్నాయని ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని ఉన్న వీధుల పొడవు తెలుసుకొని ఆ ప్రాంతాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారా లేదా అని సాయంత్రం పూట వీధి కాలువలను శుభ్రం చేస్తున్నారా లేదా అని పరిశీలించాలని ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే పై వారికి తెలియజేసి అందుకు చేపట్టవలసిన చర్యల గురించి తెలుసుకొని వెంటనే ఆచరణలోకి తీసుకువస్తే ప్రజలను వ్యాధుల నుంచి బయటకి తీసుకురాగలమని కలెక్టర్ అన్నారు. ఏడవ డివిజన్లో 926, ఆరవ డివిజన్లో 768 ఇళ్ళు ఉన్నాయని ప్రతి ఇళ్లల్లోనూ చెత్త సేకరణ సక్రమంగా జరిగేటట్లు చూడాలని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలని అన్నారు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హుల తో పాటు అనర్హులకు సంబంధించి వారి వివరాలు పొరపాటున ఏమైనా చేసి ఉంటే తిరిగి పంపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశయం మేరకు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ఆ విధంగా అందేటట్లు తగు చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి వారు అనారోగ్యం పాలు కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు తాసిల్దార్ పార్వతి పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post