ఏనుగుల దాడిలో ఒకరు మృతి..!
- మరోకరి పరిస్థితి విషమం
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం ఓఎన్ కొత్తూరు గ్రామ పంచాయతి పరిధిలోని శ్రీనివాపురం అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం ఏకలనత్తం గ్రామానికి చెందిన గోవిందప్ప (55) ఏనుగుల దాడిలో అక్కడిక్కడే మృతి చెందాడు. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన నాగరాజుకు తీవ్రగ్రాయాలు కావడంతో 108 అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి గుడుపల్లె ఎస్సై రామాంజనేయులు, పారెస్ట్ అధికారులు చేరుకొని విచారణ చేస్తున్నారు.
Comments
Post a Comment