Trishul News

రామయ్య సన్నిధిలో చంద్రబాబు..!

- 19 ఏళ్ల తరువాత స్వామిని దర్శనం చేసుకున్న బాబు 
భద్రాద్రి కొత్తగూడెం:
తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటన
లో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారాముల స్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శివాజీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత టీడీపీ అధినేత ఈరోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయంలోని శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండతులతో చంద్రబాబు వేదాశీర్వచనం పొందారు. అనంతరం స్వామివారి జ్ఞాపిక, స్వామి వారి లడ్డు ప్రసాదాలను చంద్రబాబుకు ఆలయ ఈఓ అందజేశారు. భద్రాద్రి సీతారామయ్య దర్శనం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రాచలం కరకట్టను పరిశీలించారు.
చంద్రబాబు మాట్లాడుతూ... 20ఏళ్ల క్రితం కట్టిన కరకట్టను ప్రజలు ఈనాటికీ గుర్తుపెట్టుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ సమస్యను స్వయంగా పరిశీలించానని చెప్పుకొచ్చారు. చేసిన అభివృద్ధి సామాజిక సేవా శాశ్వతంగా ఉండటం ఎంతో తృప్తి నిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్న చిన్నపాటి లోటుపాట్లను ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. విలీన గ్రామాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టి బాధిత ప్రజలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు సూచించారు.
చంద్రబాబును కలిసిన భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే

చంద్రబాబును భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదేం వీరయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఐదు విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా చంద్రబాబును పొదేం వీరయ్య విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post