Trishul News

గృహ నిర్మాణాలకు లక్ష్యాలను నిర్దేశించుకొని సాధించాలి..!

- జరుగుతున్న గృహనిర్మాణ పనులను వేగవంతం చేయండి 

- లబ్ధిదారులకు రుణాలు, సిమెంట్ పంపిణీ, ఇసుక లభ్యం అయ్యేలా చూడాలి.

- చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణన్ 
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
 పలమనేరు నియోజకవర్గపరిధిలో మొత్తం 12131 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారని 45 శాతం పనులను పూర్తి చేసారని లక్ష్యాలను సాధించే దిశగా క్షేత్ర స్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించి పనులు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిణారాయణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తో కలసి గృహనిర్మాణ శాఖ, ఎంపిడివోలుతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఇంకా ప్రారంభించని గృహానిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని ఇప్పటివరకు సిమెంట్ తీసుకొన్న వారు రుణాలు పొందిన వారు తప్పనిసరిగా ప్రారంభించేలా చూడాలన్నారు. అదేవిధంగా రుణాలు పొందిన వారు గృహానిర్మాణాలు ఏ స్థాయిలో చేసుకొంటున్నారో పరిశీలించి, నిర్మాణాలు చేసుకొంటున్నవారికి రుణాలు ఇప్పించాలన్నారు. వేగంగా నిర్మాణాలు చేసి పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వివిధ స్థాయిలలో జరుగుతున్న నిర్మాణాలను అడిగారు. రూప్ లెవల్ ఆపై స్థాయికి చేరుకున్న నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. లేఔట్ లలో నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని, నిర్మాణాలు వేగవంతంగా చేసుకొంటే లబ్ధిదారులకు చాలా మేలు జరుగుతుందని ఆ విధంగా లబ్ధిదారులకుచెప్పి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోహౌసింగ్ పి డి పద్మనాభం, ఈ ఈ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ తదితర ఇంజనీరింగ్ అధికారులుపాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post