అమృత్ సరోవర్ పథకం పనులు శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడాలి..!
- ఉపాధి కల్పనతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉండాలి
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వతమైన పనులు చేపట్టాలని భావిస్తున్నాయి
- జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం కింద శాశ్వతముగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని భావించడం జరిగిందని ఇందులో భాగంగా అమృత్ సరోవర్ పథకం కింద పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం బుడితి రెడ్డిపల్లి గ్రామ పరిధిలో చేపట్టిన చెరువు పనులను జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఇప్పటివరకు 70 మంది పనిచేయడం ద్వారా సుమారు 1700 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయడం ద్వారా ఈ అమృత్ సరోవర్ కార్యక్రమం కింద చెరువు నిర్మాణం చేయబడిందని కలెక్టర్ కు వివరించారు. ఇటువంటి కార్యక్రమాలను ఈ కార్యక్రమం ద్వారా చేపట్టడం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుందని, చుట్టుపక్కల బోర్లలో నీటిమట్టం పెరుగుదలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇటువంటి కార్యక్రమాన్ని ఎంపిక చేసినందుకు యాదమర్రి మండల ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రమ్య, గ్రామ సర్పంచ్ వాసుదేవ రెడ్డిలను అభినందించారు. అదేవిధంగా శాశ్వతంగా ఉండేటట్లు కట్ట బలంగా ఉండేటట్టు మరింత పని చేయాలని సప్లై ఛానల్ పనులు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి భూగర్భ జలాల అభివృద్ధి చెందేలా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి చంద్రశేఖర్, ఎంపీడీవో హరినాథ్ రెడ్డి, ఇంచార్జ్ తహసిల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో విద్య నాణ్యతగా ఉండాలంటే విద్యార్థులకు ఆహారం మంచి వసతి ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ యాదమర్రి మండలంలోని మాదిరెడ్డిపల్లి మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల తనిఖీ సందర్భంగా అన్నారు. జిల్లా కలెక్టర్ మధ్యాహ్నం భోజన పథకంతో పాటు నాడు నేడు కార్యక్రమంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆహారం కు సంబంధించి మెనూ ఉపాధ్యాయులను అడిగి ఆ విధంగా ఇస్తున్నారా లేదా అని పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులను కూడా అడిగి సరైన ఆహారం ఇస్తున్నారా లేదా వారిలో ఏదైనా పోషక లోపాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు క్లాస్ రూమ్ తోపాటు బాత్రూం నిర్మాణం జరుగుతోందని నాడు నేడు కార్యక్రమంలో రెండవ దశలో పలు పనులను చేపట్టనున్నట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్ తెలిపారు. పనులు నాణ్యతగా చేయించాలని పాఠశాల కోసం ఇంకా స్థలం ఉంటే చూడాలని విద్యార్థులకు కొంత ఇరుకుగా ఉందని పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అన్నారు. సంబంధిత శాఖల వారు తగు చర్యలు తీసుకొని పాఠశాల చుట్టుపక్కల ఏదైనా స్థలం ఉంటే చూడాలని అన్నారు. ఈ సందర్భంగా పనుల నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హరినాద్ రెడ్డి ఇన్చార్జి తాసిల్దార్ మహేష్ తదితర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పోషక విలువలు, రక్తహీనత గురించి పాఠశాలలలో, అంగన్వాడీ కేంద్రాలలో తరచుగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ యాదమరి మండలంలోని 184. గొల్లపల్లి గ్రామ సచివాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వర్షాకాలం రానున్నదని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరం పర్యవేక్షించాలని, అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రికాషనరి డోస్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరుతో పాటు వాలంటీర్ల బయోమెట్రిక్ హాజరును జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది నిర్ణయించిన మేరకు గ్రామ సచివాలయ పరిధిలోని ఆరు స్కూళ్లను ప్రతి 10 రోజులకు ఒకసారి పరిశీలించాలని అదేవిధంగా అంగన్వాడి కేంద్రాలలో ఉన్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఏదైనా వారికి పోషక లోపాలు కానీ రక్తహీనత కానీ ఉంటే వారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని ఆరోగ్యవంతంగా లేనివారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వారిని ఆరోగ్యవంతులుగా తయారు చేయాల్సిన బాధ్యత ఐసిడిఎస్ మరియు వైద్య సిబ్బంది మీద ఉందని అన్నారు. అదేవిధంగా గ్రామంలో గృహ నిర్మాణాలు, గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని సిబ్బందిని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా ఇల్లు లేని వారందరికీ ఇంటి సౌకర్యం కల్పించేందుకు భారీ ఎత్తున గృహ నిర్మాణ పథకం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంకు అర్హులైన వారందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని గృహ నిర్మాణాలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ యాదమర్రి మండలం పుల్లయ్య గారి పల్లిలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని సందర్శించారు. మొత్తం 20 మందికి కాలనీలో ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని ఒకరు మరణించగా మిగతా 19 మంది గృహ నిర్మాణాలు ప్రారంభించారని రెండు గృహాలు పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో విద్యుత్ సౌకర్యం, నీటి వసతి, రోడ్డు కల్పించడం జరిగిందని వేగవంతంగా గృహ నిర్మాణాలు చేపట్టి ఇంటి యజమానులుగా కావాలని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను వారికి ఇంతవరకు అందిన రుణం, సిమెంటు, బిల్లుల గురించి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సకాలంలో గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లబ్ధిదారులతో అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హరినాథ్ రెడ్డి, ఇన్చార్జి తాసిల్దార్ మహేష్, గృహ నిర్మాణశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment