శ్రీకాళహస్తీశ్వరుని సేవలో కర్ణాటక మంత్రి కె. సునీల్ కుమార్..!

- స్వాగతం పలికిన కోలా ఆనంద్
శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్ :
శ్రీకాళహస్తి ముక్కంటి సేవలో కర్ణాటక రాష్ట్ర ఇందన మరియు కన్నడ సాంస్కృతిక శాఖా మంత్రి కే. సునీల్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీకాళహస్తి ఆలయానికి దర్శనార్థం వచ్చిన కర్ణాటక రాష్ట్ర మంత్రి సునీల్ కుమార్ కి బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి, నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జి కోలా ఆనందకుమార్ ఆలయ అతిథి గృహం వద్ద నియోజకవర్గ బిజెపి నాయకులతో కలసి ఆత్మీయస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు దక్షిణగోపురం వద్ద స్వాగతం పలికి, ప్రత్యేక రాహు-కేతు పూజా కార్యక్రమం నిర్వహించారు. తరువాత స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేసి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, బిజెపి నాయకులు వజ్రం కిషోర్, గాండ్ల శివకుమార్, యువమోర్చ సభ్యులు, చందు రాయల్, భరత్ నాయుడు రవిరాయల్, ఢిల్లీ, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు