కుప్పంలో తెదేపా నేతలు అరెస్ట్.. 14 రోజులు రిమాండ్..!

కుప్పం, త్రిశూల్ న్యూస్ :
మూడురోజులుగా కుప్పం రాజకీయాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చంద్రబాబుని అడ్డుకోవడంతో మెుదలై, తెదేపా నాయకులపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అన్నా క్యాంటీన్ ధ్వంసం అనంతరం చంద్రబాబు పాదయాత్ర, తర్వాతి పరిణామాలు అన్ని తెదేపా కార్యకర్తలు, నాయకులపై పోలీసు కేసులు ప్రారంభమయ్యాయి.
కుప్పంలో మళ్ళీ ప్రాంతంలో ఘర్షణలు చలరేగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం సంఘటనకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. ఆ సందర్బంగా జరిగిన లాఠీచార్జీ తదితర సంఘటనల్లో మరో మూడు కేసులు నమోదయ్యాయి. కుప్పం నియోజకవర్గంలో తెదేపా నేతల అరెస్టుల పర్వం మెుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు పలు కేసులు నమోదుచేసి అరెస్ట్​లు చేసి కోర్టులో హాజరు పరిచారు. రామకుప్పం మండలం కల్లుపల్లిలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి మాజీ శాసనమండలి సభ్యుడు గౌనిగాని శ్రీనివాసులతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ముద్దాయిలుగా చేర్చారు. ఈ కేసుల్లో గౌనిగాని శ్రీనివాసు, మణి, జాకీర్​ తో పాటు పలువురుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచగా 14రోజులు రిమాండ్ విధించింది. చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే అరెస్ట్​లు ప్రారంభమవ్వడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుప్పంలో టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు చేశారు పోలీసులు.. రామకుప్పం మండలంలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.. మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులుతో సహా సుమారు 60 మందిపై కేసులు నమోదు చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసులతో పాటు.. 143, 147, 148, 149, 424 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు… మరో 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. మొత్తంగా కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు కారణం అవ్వడంతో పాటు.. టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. అయితే, ఉద్దేశ్యపూర్వకంగానే రివర్స్‌లో తమపైనే పోలీసులు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు