మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రత పెంపు..!
- ఎన్ఎస్ జీ డిఐజి సమర్ దీప్ సింగ్ ఉత్తర్వులు
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనల్లో ఇటీవల వైసిపి నాయకులు తరచూ గొడవలు సృష్టించి ఉండడం. కొన్నినెలల క్రితం టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో అల్లరిమూకల దాడి.. తాజాగా కుప్పంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి.. వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు 6+6 కమాండోల భద్రత ఉంది. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం 12+12 భధ్రత పెంచుతూ ఎన్ఎస్ జి ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని, ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఎస్ జీ డిఐజి సమర్ దీప్ సింగ్ నేతృత్వంలోని బృందం గురువారం తనిఖీ చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన సమర్ దీప్ సింగ్ బృందం ప్రతి అంతస్తుకి, ప్రతి గదికీ వెళ్లి నిశితంగా పరిశీలించింది. చంద్రబాబు చాంబార్ ఎక్కడ? ఆయన సందర్శకుల్ని ఎక్కడ కలుస్తారు? ఆయనను కలిసేందుకు వచ్చేవారిని ఎలా తనిఖీ చేస్తున్నారు? ఏ ఏ పరికరాలను వినియోగిస్తున్నారు? స్థానిక పోలీసులు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? వంటి విషయాలన్నీ ఆయన కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. టిడిపి కార్యాలయ కార్యదర్శి. ఎమ్మెల్సీ అశోక్ బాబు.. ఎన్ఎస్ జీ డీఐజీకి అన్ని వివరాలు తెలియజేశారు.ఆ తర్వాత సమర్ దీప్ సింగ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని, అక్కడ భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. పలువురు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను సైతం ఎన్ఎస్ జీ డీఐజీ కలిసినట్లు సమాచారం. చంద్రబాబుకి కల్పిస్తున్న భద్రతను పర్యవేక్షించేందుకు ఎన్ఎస్ జీ డీఐజీ రావడం అందులో భాగమేనని అంటున్నారు. 'వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయన ఇంటి గేట్లను తాళ్లతో కట్టేశారు. ఆయన అమరావతి పర్యటనకు వెళితే బస్సుపై రాళ్లేసారు. పైగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని అప్పటి డిజిపి ఆ చర్యను సమర్థించారు. ప్రస్తుత మంత్రి, అప్పటి ఎమ్మెల్యే జోగి రమేష్.. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వచ్చారు. చంద్రబాబు ఎప్పుడు కుప్పం వెళ్లినా ఏదోరకమైన అవరోధాలు సృష్టించాలని చూస్తున్నారు. చంద్రబాబుని భౌతికంగా కూడా ఇబ్బంది పెట్టాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. అందుకే ఆయన భద్రతపై కేంద్రం స్పందించి చంద్రబాబు భద్రతను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Post a Comment