కుప్పంలో మరో సారి అన్నా క్యాంటిన్ ధ్వంసం..!

- వైసిపి నేతల పనేనంటూ టిడిపి ఆరోపణ


కుప్పం, త్రిశూల్ న్యూస్ :

కుప్పంలో అర్ధరాత్రి అన్న క్యాంటీన్​ను కూల్చివేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కూల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఇటీవల కుప్పం పట్టణంలోని పాత పంచాయతీ బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఎదుట... మూడు నెలలుగా అన్న క్యాంటీన్​ను నిర్వహిస్తున్నారు. ఈనెల 25న తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన సందర్బంగా వైకాపా శ్రేణులు నిరసన చేపట్టి... అన్న క్యాంటీన్ పందిరి, తెదేపా బ్యానర్లు ధ్వంసం చేశారు. తాజాగా మరోసారి సోమవారం అర్ధరాత్రి అన్న క్యాంటీన్ పందిరి, తెదేపా ఫ్లెక్సీలు పట్టణంలో పలు చోట్ల బ్యానర్లు ధ్వంసం చేశారు. అన్న క్యాంటీన్ వద్ద ధ్వంసం చేసిన సామగ్రిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అధికార పార్టీ శ్రేణులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా వైకాపా-తెదేపా వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. వైకాపా శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన సందర్భంలో అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. మళ్లీ దాన్ని పునరుద్ధరించగా.. ఇప్పుడు దుండగులు మరో సారి దాడి చేశారు. మరోవైపు కుప్పం పట్టణంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద చంద్రబాబు ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.


Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు