బంగ్లా సరిహద్దులో మహిళపై బీఎస్ఎఫ్ సిబ్బంది హత్యాచారం..!

- సిబ్బందిని అరెస్టు చేసిన పారామిలటరీ ఆర్గనైజేషన్
కోల్‌కతా, త్రిశూల్ న్యూస్ :
బంగ్లాదేశ్ సరిహద్దుల సమీపంలో ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు సరిహద్దు భద్రతా దళ సిబ్బందిని అరెస్టు చేసినట్టు పారామిలటరీ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి ఒకరు శనివారంనాడు తెలిపారు. అరెస్టు అయిన వారిలో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరుగగా, నిందితులిద్దరినీ తదుపరి చట్టపరమైన చర్యల కోసం పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించారు. నిందితులను సస్పెండ్ చేసి, కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలోని బగ్డా బోర్డర్ ఔట్ పోస్ట్ వచ్చిన ఈనెల 26న ఈ ఘటన జరిగినట్టు చెప్పారు. ''ఇండియా నుంచి బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఒక మహిళను బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. ఆ వెంటనే సమీపంలోని పొలాల వైపు లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇందుకు ఏఎస్ఐ సహకరించాడు'' అని ఆ అధికారి వివరించారు. సదరు మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

టీఎంసీ ఆగ్రహం...
కాగా ఈ ఘటనపై అటు టీఎంసీ, ఇటు బీజేపీకి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి బీఎస్‌ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల పరిధి నుంచి 50 కిలోమీటర్ల వరకూ విస్తరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మొదట్నించీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. తాజా ఘటనపై టీఎంసీ ఓ ట్వీట్‌లో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. బీజేపీ ఇండియా అవకతవకల పాలనలో దేశంలోని మహిళలకు భద్రత లేకుండా పోయిందని, బీఎస్ఎఫ్ అధికారి, జవాను ఒక మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు తప్పవని బెదరించారని, ఆత్మనిర్భర్ భారత్‌కు ఇదో ఉదాహరణ అని టీఎంసీ విమర్శించింది.

తిప్పికొట్టిన బీజేపీ..
చెదురుమదురు ఘటనలను సాకుగా చూపి మొత్తం బలగాల ప్రతిష్టను దిగజార్చడం సరికాదని బీజేపీ పేర్కొంది. టీఎంసీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, ఎవరు నేరానికి పాల్పడినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని బీజేపీ ప్రతినిధి షమిక్ భట్టాచార్య చెప్పారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు