బాలయ్యకు షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
సినీ నటుడు.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా నోటీసులు జారీ చేసింది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. సినిమా రిలీజ్ సమయంలో పన్ను రాయితీ తీసుకుని.. టికెట్ రేట్లు ఎందుకు తగ్గించలేదని.. అలాగే పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం కోర్టు.. బాలకృష్ణతో సహా అప్పటి తెలంగాణ, ఏపీ ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటిసులు పంపించింది. ఏపీ విషయానికి వస్తే.. చంద్రబాబు హయాంలో ఇలా సినిమాలకి పన్ను రాయితీలు ఇచ్చారని.. కానీ వారు మాత్రం ఆ రాయితీలను జనాలకి బదలాయించకుండా వాళ్ళ దగ్గర దోచుకున్నారని.. అందుకే సినీ ఇండస్ట్రీ బాబుకి వత్తాసు పలుకుతోందన్నది పిటిషనర్ ఆరోపణ.. ఇటీవలే అఖండతో భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖతాలో వేసుకున్న బాలయ్యకు.. అంతకుముందు సరైన హిట్ ఏదైనా ఉంది అంటే అది గౌతమీపుత్ర శాతకర్ణి సినిమానే.. ఆయన కెరీర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ హిట్స్ లో గౌతమీ పుత్ర శాతకర్ణి ఒకటి.. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటికే బాలయ్య ఎమ్మెల్యేగా ఉండడం.. సొంత బావ అయిన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండడం.. తెలంగాణ ప్రభుత్వంతో.. టాలీవుడ్ కు సత్సంబంధాలు ఉండడం.. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు నేలపై జరిగిన చరిత్రాత్మక సినిమా అని ప్రచారం చేసుకోవడంతో.. ఈ సినిమాకు అప్పటి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పన్ను రాయితీ కల్పించాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం గౌతమీపుత్ర శాతకర్ణి కథతో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకు పన్ను రాయితీ ఇవ్వడానికి అంగీకరించింది. కారణం ఏదైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి చిత్ర యూనిట్ పన్ను రాయితీ పొందింది. కానీ ఆ మేరకు టికెట్ రేట్లను తగ్గించి ప్రజలకు బెనిఫిట్ కలిగించడంలో గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ చిత్రయూనిట్ ఫెయిలైందన్నది ప్రధాన ఆరోపణ అందుకే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సుప్రీం కోర్టు నుంచి బాలయ్యకు నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ ను దాఖలు చేయగా ప్రేక్షకులకు పన్ను రాయితీ ప్రయోజనాలను బదలాయించకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. అందుకే ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఇందుకు సంబంధించి నోటీసులు అందాయి. ప్రస్తుతం రాజకీయాలు హీటెక్కిన నేపథ్యంలో ఇది వైసీపీకి ఓ అస్త్రంగానే దొరుకుతుంది. అయితే ఇలా పన్ను రాయితీ తీసుకుని.. టికెట్ల ధరలు తగ్గించని సినిమాలు ఎన్నో ఉన్నాయి.. వాటిపైనా ఇతరులు ఇప్పుడు కోర్టును ఆశ్రయించే అవకాశం దక్కుతుంది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు