ప్రియుడు మోజులో పడి కన్న తండ్రిని కడతేర్చిన కసాయి కూతురు..!
- తల్లి లేని బిడ్డపై మమకారంతో పెళ్లి కుదుర్చి, రెండు అంతస్తుల ఇళ్ళు రాసిచ్చిన తండ్రినే మట్టు బెట్టిన వైనం
- నెల రోజుల్లో రిటర్డ్ కానున్న టీచర్ దారుణ హత్యతో కలకలం
- హరితతో పాటు ఆమె ప్రియుడు హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు
- ప్రియుడికి పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చినట్లు సమాచారం
- క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించిన డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐలు వల్లి బాష, శేఖర్
మదనపల్లె, త్రిశూల్ న్యూస్ :
ప్రియుని మోజులో పడి కన్న తండ్రిని అతి దారుణంగా హత్య చేసిన కూతురి ఉదంతం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పట్టణంలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలీకమ్ కాలనీలో కాపురం ఉంటున్న జిఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి భార్య లత ఏడాదన్నర క్రితం చనిపోయింది. అప్పటి నుండి తన గారాల పట్టి హరిత (25)ను దొరస్వామి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఉన్నత చదువులు చదువుకున్న కూతురికి నెల రోజుల క్రితం ఓ పెళ్లి సంబంధం కుదుర్చాడు. తన పేరున ఉన్న రెండు అంతస్తుల ఇంటిని సైతం కూతురు పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ నెలలో రిటైర్డ్ అయ్యే డబ్బుతో ఎలాగైనా బిడ్డకు పెళ్లి గ్రాండుగా చేయాలని నిర్ణయం తీసుకున్న టీచర్ ఈరపు దొరస్వామి (62) కి అవే చివరి రోజులు అయ్యాయి. ప్రియుడుతో హాయిగా గడపాలని పగటి కలలు కన్న హరిత కంటికి రెప్పలా కాపాడుతున్న దైవ సమానులైన కన్న తండ్రికి మద్యం అలవాటు ఉన్న విషయం అలుసుగా తీసుకొని బుధవారం రాత్రి చుట్టు పక్కల వాళ్ళు అందరూ నిద్రపోయాక కన్న తండ్రి అనే కనికరం కూడా లేకుండా అతి క్రూరంగా హత్య చేసింది. అయితే ఈ హత్య హరిత ఒకటే చేసిందా.. లేక ప్రియుని హస్తం ఏమైనా వుందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్చి ఉంది. పథకం ప్రకారం దొరస్వామిని దారుణంగా హత్య చేసినట్లు సంఘటన స్థలంలో మృతదేహం పడి ఉన్న తీరును బట్టి తెలుస్తోంది. హత్య జరిగిన ప్రదేశానికి డిఎస్పీ ప్రసాద్ రెడ్డి వన్ టౌన్, తాలుక సీఐలు వల్లిబాష, శేఖర్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment