రాబోయేది టిడిపి ప్రభుత్వమే.. పోలీసులను వదిలిపెట్టేదిలే - నారా లోకేష్

- చిత్తూరు సబ్ జైలులో ఉన్న టిడిపి నేతలు, కార్యకర్తల పరామర్శ
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
ఏపీలో రాబోయేది తెదేపా ప్రభుత్వమేనని.. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. ఇటీవల కుప్పంలో వైకాపా నేతలు పెట్టిన కేసులతో అరెస్టయి చిత్తూరు సబ్‌ జైలులో ఉన్న తెదేపా నేతలను ములాఖత్‌ ద్వారా పరామర్శించారు. మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న లోకేష్ కు టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా చిత్తూరుకు చేరుకొని ఇటీవల కుప్పంలో వైకాపా నేతలు పెట్టిన కేసులతో అరెస్టయి చిత్తూరు సబ్‌ జైలులో ఉన్న తెదేపా నేతలను పరామర్శించి అధైర్య పడొద్దని దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. పోలీసులు వైకాపాకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక అన్నా క్యాంటీన్లు మూసేశారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 2010 అన్నా క్యాంటీన్లు మూసివేశారని.. తల్లి, సోదరికి ముద్ద పెట్టని వ్యక్తి ప్రజలకు ఏవిధంగా పెడతారని ప్రశ్నించారు. పేదలకు భోజనం లేకుండా చేసిన వ్యక్తి జగన్‌ అని అన్నారు. మంగళగిరిలో అన్నా క్యాంటీన్‌ ప్రారంభిస్తే 60మంది తెదేపా కార్యకర్తల్ని అరెస్టు చేశారని.. చంద్రబాబు పర్యటనలో అన్నా క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తే ధ్వంసం చేశారని మండిపడ్డారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ఎవరైనా ధ్వంసం చేస్తారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు