అన్న క్యాంటిన్ ను ద్వంసం చేయడం దుర్మార్గపు చర్య..!

- గిద్దలూరు టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన 
గిద్దలూరు, త్రిశూల్ న్యూస్ :
కుప్పం నియోజకవర్గం పర్యటనలో బాగంగా రెండో రోజు మాజీ సీఎం చంద్రబాబుపై స్థానిక వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడుతూ వారి పర్యటనకు అడుగడుగునా ఆటంకం కల్గిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం శోచనీయం అని గిద్దలూరు టిడిపి శ్రేణులు పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ను చంద్రబాబు ప్రారంభించాల్సి ఉండగా దానిని వైసీపీ శ్రేణులు పూర్తిగా ద్వంసం చేయడం చూస్తుంటే పేదల నోటి కాడి అన్నం తీయటం ఈ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్యలా అనిపిస్తుందన్నారు. గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్  ముత్తుముల అశోక్ రెడ్డి  ఆదేశానుసారం గిద్దలూరు టీడీపీ శ్రేణులు నిరసన తెలియచేశారు. గిద్దలూరు - రాచర్ల రోడ్డుపై బైటాయించి నల్ల బ్యాడ్జిలు ధరించి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన దొషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజు కుప్పం పర్యటనలో టీడీపీ ఫ్లెక్సీలను జెండాలను చించి చెల్లా చెదురుగా పడవేసి వైసీసీ పార్టీ ఫ్లెక్సీలు జెండాలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని ఈ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రాబోవు రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు