వామ్మో పులి.. భయం గుపింట్లో కుప్పం ప్రజలు..!
- పట్టణంలోని సోమేశ్వర స్వామి ఆలయం వద్దె పులి
కుప్పం, త్రిశూల్ న్యూస్ : కికారణ్యంలో ఉండాల్సిన మృగాలు జన సంచారంలోకి వచ్చి హల్ చేస్తున్న ఘటనలు ఈ ఎక్కడో ఓ చోట వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కుప్పం పట్టణంలోని సోమేశ్వర ఆలయ వద్ద ఓ పులి హల్ చేసింది. సుమారు రాత్రి 12గంటల సమయంలో ఆలయ పూజారి నిద్రకు ఉపక్రమించే క్రమంలో ఆలయ ప్రహరీ గోడ వద్ద ఉన్న పులిని చూసి పూజారి కేకలు వేశారు. కేకలకు బయపడిన పులి అక్కడి నుంచి పరారయ్యింది.
అయితే ఆలయ ప్రహరీ గోడను పులి పంజాతో గోకిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించడంతో మంగళవారం ఉదయం అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఆలయం వద్దకు చేరుకున్న అధికారులు పులి జాడ కోసం అన్వేషస్తున్నారు. పులి సంచారం విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు భయందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా పులి జాడను కనిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Post a Comment