అమ్మా.. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా..!

- ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాలపై ఆరా 

- సమస్యల పరిష్కారంపై సత్వర చర్యలకు ఆదేశం

- గడపగడపకు మన ప్రభుత్వం చేపట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
చంద్రగిరి, త్రిశూల్ న్యూస్ :
"అమ్మా.. ప్రభుత్వ పథకాలు అన్నీ బాగూన్నాయా.. ? అన్నీ మీకు అందుతున్నాయా.. ? ఎక్కడైనా లోటు పాట్లు ఉంటే నా దృష్టికి తీసుకుని రండి.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రాజకీయ పార్టీలు కుల, మత, వర్గాలకు అతీతంగా అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నా." అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. ఆదివారం పాకాల మండలం బందార్లపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు మహిళలు హారతులు పట్టి గ్రామంలోకి స్వాగతించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ది దారులు పొందిన సంక్షేమ పథకాల వివరాలను  తెలియపరుస్తూ ప్రత్యేకంగా ముద్రించిన బుక్ లెట్ ను అందించారు. 
అభివృద్ధి పనులకు రూ.52 లక్షలు మంజూరు..!
గ్రామంలో అంతర్గతంగా సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంకు సుమారు రూ.52 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. అలాగే గ్రామంలో నెలకొన్న రెవెన్యూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని రెండు రోజుల పాటు గ్రామంలోనే రెవెన్యూ సదస్సు నిర్వహించేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పలువురు రైతులు తమ పొలాల వద్దకు వెళ్ళే విద్యుత్ తీగలు వల్ల అంతరాయం కలుగుతోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రావడంతో సమస్య పరిష్కారం చేయాలని అక్కడే ఉన్న విద్యుత్ అధికారులకు సూచించారు. 
 వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు..!
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభానికి ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. అనంతరం  గ్రామంలోని గ్రామదేవతలకు పూజలు చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామంలో అందరికీ మంచి జరగాలని ప్రార్థించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు