పేదల అన్నా క్యాంటిన్ ను కూల్చివేయడం దుర్మార్గపు చర్య..!
- కుటిల రాజకీయాలు ఎల్లవేళలా పనిచేయదు
- పేదల కడుపు కొట్టి మీరు సాధించిదేమిటి?
- కుప్పంలో టిడిపి నేతలు ఆందోళనలో ఇంచార్జి మునిరత్నం
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గత 86 రోజులగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటిన్ పై వైసిపి నేతలు చేస్తున్న కవ్వింపు చర్యలు తగవని కుప్పం టిడిపి నియోజకవర్గం ఇంచార్జి పిఎస్. మునిరత్నం హితువు పలికారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో టిడిపి ఏర్పాటు చేసిన తాత్కాలిక అన్నా క్యాంటిన్ టెంట్ ను కూల్చివేయడంపై టిడిపి శ్రేణులు బగ్గుమన్నారు. ఇందుకు నిరసనగా టిడిపి శ్రేణులు కుప్పం ఆర్టీసీ కూడలిలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ.. కుప్పంలో టీడీపీ నేతల పెట్టిన అన్నా క్యాంటీన్ తాత్కాలిక షెడ్డును వైసీపీ నేతలే ధ్వంసం చేశారని... పేదలకు అన్నం పెడితే తప్పా అని ప్రశ్నించారు. ఎంతో మంది వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే గ్రామీణలకు మధ్యాహ్నం భోజనం పెట్టడం కూడా తప్పుగా భావించే వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయాని హెచ్చరించారు.
మంగళవారం కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు నల్ల జెండాలు చేత బట్టి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ షెడ్డును ధ్వంసం చేసిన చోటే కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎక్కడైతే తాత్కాలిక అన్న క్యాంటీన్ ధ్వంసం అయ్యిందో అక్కడే అన్నా క్యాంటీన్ పేరు మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 500 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ షెడ్డును ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుప్పం పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, రామకుప్పం మండల అధ్యక్షులు ఆనంద్ రెడ్డి, నియోజకర్గ యువత అధ్యక్షులు చెక్కునత్తం మణి, నాయకులు సాంబశివం, ఎస్సీ సేల్ అధ్యక్షులు సుబ్బు, బీసీ సెల్ అధ్యక్షులు మురళి, శాంతిపురం యువత అధ్యక్షులు సుబ్బు, వెంకటరమణ, మురుగేష్,
బీఎంకె రవిచంద్ర బాబు, కౌన్సిలర్ సోము, దివాకర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment