మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టండి - కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
భవిష్యత్ తరాల మనుగడకు పర్యావరణ తోడ్పాటును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "హరిత నగరం" కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై, మొక్కల పెంపకాన్ని బాధ్యతగా స్వీకరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత పిలుపునిచ్చారు. "జగనన్న హరిత నగరం" కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక 54 వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని పచ్చదనంతో నింపడానికి మొత్తం ఒక కోటీ 22 లక్షల రూపాయల వ్యయంతో 15 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మొక్కలు ఎదిగేందుకు అనువైన వర్షాకాలపు వాతావరణం కావున, నగరంలో అన్ని డివిజనుల్లో మొక్కలు నాటి, పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు. పర్యావరణ హితం కోసం చేస్తున్న ఈ ఆశయాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, నగర పౌరులు తమ ఇంటి పరిసరాలు, వీధుల్లో మొక్కలు పెంచాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు సంపత్ కుమార్, సంజయ్, చంద్రయ్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఉద్యాన శాఖాధికారి ప్రదీప్ కుమార్, 8వ డివిజన్ కార్పొరేటర్ కామాక్షి దేవి, సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు