అరసవల్లిలో మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు..!


శ్రీకాకుళం, త్రిశూల్ న్యూస్ :

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఏడాదిలో రెండు సార్లు ఈ అద్భుతం జరుగుతుంది. దక్షిణాయణం అక్టోబర్ 1, 2 తేదీలలో... ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీలలోను స్వామివారికి కిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. దాదాపు ఐదు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని సూర్యకిరణాలు తాకడం చూసి భక్తులు పులకించిపోయారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు