కనకదుర్గమ్మ ఆలయంలో అపశృతి.. క్యూలైన్ లో భక్తుడు మృతి..!

విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా వివిధ అవతారాల్లో దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తులు క్యూలైన్ లోనే మృతిచెందాడు. హైదరాబాద్ కు చెందిన మూర్తి(45) కనకదుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చాడు. రూ.500 క్యూలైన్ ద్వారా ప్రత్యేక దర్శనం కోసం వెళుతన్న అతడు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు. వెంటనే ఆలయ సిబ్బంది అతడి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. కానీ అతడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు