గరుడసేవలో మూడు లక్షల మంది భక్తులకు వాహ‌న దర్శన భాగ్యం - టిటిడి ఈఓ

– హారతుల స్థానంలో భక్తులకు దర్శనం అనుమతి

– ఏర్పాట్లును పరిశీలించిన టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన గరుడసేవ అక్టోబర్ 1న జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వాహ‌న సేవ‌కు విచ్చేసే భ‌క్తులంద‌రికి వాహ‌న దర్శనం కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాటు చేసిన‌ట్లు టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. శ్రీ‌వారి ఆల‌య‌ నాలుగు మాడ వీధుల్లో హార‌తి పాయింట్లు, గ్యాల‌రీల‌ను ఈవో, డిఐజి ర‌వి ప్ర‌కాష్‌, జిల్లా ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు.
ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు మూడు లక్షల మంది భక్తులకు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది సౌత్ వెస్ట్ గేటు, నార్త్ వెస్ట్ గేటు, నార్త్ ఈస్ట్ గెట్ల వద్ద ఉన్న హారతి పాయింట్ల‌లో హారతులకు బ‌దులు భక్తులను స్వామి వారి వాహ‌న సేకు అనుమ‌తిస్తామ‌న్నారు. ఒకరు హార‌తి ఇచ్చే సమయంలో దాదాపు ఐదు మందికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌వ‌చ్చ‌ని చెప్పారు. కావున ఈ ఏడాది హార‌తుల‌ను రద్దు చేసి సామ‌న్య భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు తెలియ‌జేశారు. ప్రతి హార‌తి పాయింట్లో 10 వేల‌ మందికి గరుడసేవ దర్శనం కల్పించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అదేవిధంగా గ్యాలరీల‌లో రెండు లక్షల మంది, ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజన మండపం వద్దకు షాపింగ్ కాంప్లెక్స్ నుండి భక్తులను రెండవసారి అనుమతించడం ద్వారా మరో 25 వేల మందికి అద‌నంగా దర్శనం కల్పించవచ్చన్నారు. త‌ద్వారా దాదాపు 2.75 ల‌క్ష‌ల నుండి నుండి 3 లక్షల మందికి స్వామి వారి గరుడసేవ దర్శనం చేయించవచ్చని ఆయ‌న వివ‌రించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు