ముత్య‌పు పందిరి వాహనంపై శ్రీ‌ మలయప్పస్వామి దర్శనం..!

తిరుమల, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై తిరుమాఢ వీధులో ఊరేగారు శ్రీ మళయప్ప స్వామి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి వాహన సేవ వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమాఢ వీధులకు చేరుకొని స్వామి వారి ఉత్సవాన్ని తిలకించారు.
వాహనం విశిష్టత : 
ముత్యాలు నిర్మల కాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటి యామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు, రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణ స్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తాయి.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు