డిసెంబర్ నాటికి ఐదులక్షలు ఇళ్ళు పూర్తి చేయాలి - సీఎం జగన్

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
నెలరోజుల్లో ప్రాధాన్యత ప్రకారం పనులు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. అక్టోబర్‌ 25న సచివాలయాల్లో ఈ-క్రాపింగ్‌ జాబితాలను ప్రదర్శించాలని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు పలు అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ.240 అందేలా చూడాలని ఆదేశించారు. డిసెంబర్‌ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలన్నారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేస్‌-3 కింద డిసెంబర్‌లో ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు.ఎస్‌డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్‌డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. స్పందనలో వస్తున్న ఫిర్యాదులు పరిష్కారంపై సమీక్ష నిర్వహించడంతో పాటు జాతీయ రహదారులకు కావాల్సిన భూసేకరణ, వైఎస్సార్ అర్బన్-విలేజ్ క్లినిక్స్ పై అధికారులకు సూచనలు చేశారు సీఎం జగన్.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు