కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి..40 మంది మృతి..!

గుజరాత్, త్రిశూల్ న్యూస్ :
గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఆదివారం మోర్బీ ప్రాంతంలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో బ్రిడ్జి మీదుగా వెళుతున్న సందర్శకులు నదిలో పడిపోయారు. 40 మంది చనిపోయినట్లు తెలుస్తున్నది. నదిలో పడిపోయిన వారు 400 మందికి పైగా ఉండొచ్చునని పోలీసులు చెబుతున్నారు. పలువురు గాయ పడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటన జరిగినప్పుడు కేబుల్ బ్రిడ్జిపై సుమారు 500 మంది ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లోనే పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడారు.
 ఘటనా స్థలానికి రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇంతకుముందే దెబ్బ తిన్న ఈ కేబుల్ బ్రిడ్జికి రిపేర్లు చేసిన తర్వాత ఐదు రోజుల క్రితం సందర్శకుల రాకపోకలకు అనుమతించారని సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించేందుకు భారీగా అంబులెన్స్‌లను మోహరించారు. స్థానికుల సాయంతో గల్లంతైన ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇప్పటికి నీటిలో సుమారు 100 మంది చిక్కుకున్నారని వార్తలొచ్చాయి. కొన్నేండ్ల క్రితం నిర్మించిన మోర్బీ కేబుల్ బ్రిడ్జికి ఇటీవలే మరమ్మతులు పూర్తి చేసి, గుజరాత్ నూతన సంవత్సరాది సందర్భంగా ఈ నెల 26న పునఃప్రారంభించారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్‌) కింద రూ.2 లక్షలు, గాయ పడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు